మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. పెద్ద శంకరంపేట వద్ద బైక్ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు.
మృతులను కామారెడ్డి జిల్లా మాగి గ్రామానికి చెందిన లింగమయ్య, సాయవ్వ, సాయి, మానసగా గుర్తించారు. రేపు జరగబోయే రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.