కారేపల్లి, డిసెంబర్ 13 : ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని విశ్వనాథపల్లిలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి హలావత్ తారా ఉష (Tara Usha) విస్తృత ప్రచారం నిర్వహించారు. ముందుగా కారేపల్లి క్రాస్ రోడ్ లో 9,10 వార్డుల అభ్యర్థులు బట్టు రోజా, సిద్ధంశెట్టి హారికలతో కలిసి ఇంటింటికి వెళ్లి తమకు కేటాయించిన గుర్తులను చూపించి ఉష ఓటర్లను అభ్యర్థించారు. ప్రచారంలో ఓటర్లతో మాట్లాడుతూ.. గడిచిన10 ఏళ్లలో గ్రామాలు అభివృద్ధి చెందడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండటమే కారణమని అన్నారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విశ్వనాథపల్లి గ్రామపంచాయతీ ఎంతో అభివృద్ధి చెందిందని ఆమె గుర్తుకు చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు గ్రామాలలో జరిగిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్, వార్డుల అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఉష ప్రజలను కోరారు. సర్పంచ్, వార్డు అభ్యర్దులతో పాటు ఎన్నికల ప్రచారంలో విశ్వనాథపల్లి, లింగం బంజార,కారేపల్లి క్రాస్ రోడ్(రామలింగాపురం) గ్రామాలకు చెందిన యువకులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.