గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Aug 24, 2020 , 02:03:26

పేదలకు ‘డబుల్‌' ఆనందం ... హరీశ్‌రావు

పేదలకు ‘డబుల్‌' ఆనందం ... హరీశ్‌రావు

సిద్దిపేట రూరల్‌: ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో బతకాలని సీఎం కేసీఆర్‌ డబుల్‌ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట రూరల్‌ మండలం ఇర్కోడులో రూ.1.57 కోట్లతో నిర్మించిన 25 డబుల్‌ బెడ్రూం ఇండ్లు,  రూ.30 లక్షలతో నిర్మించిన ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంక్‌ను జెడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పైసా ఖర్చులేకుండా ప్రభుత్వమే నిరుపేదలకు డబుల్‌ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నదన్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 500 మందికి ఇండ్లు నిర్మించి ఇచ్చామన్నారు.


logo