హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా మానకొండూర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పంచాయతీ రాజ్ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస రావు మృతి పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి అకాల మరణం అత్యంత బాధాకరం అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.
కాగా, శుక్రవారం తెల్లవారుజామున వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి మానకొండూరు పోలీస్ స్టేషన్ సమీపంలో చెట్టును ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
ఇవి కూడా చదవండి..
వివాహితతో ఎస్ఐ రాసలీలలు..రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త
భూ వివాదంతో దళిత కుటుంబం హత్య.. బాలికపై సామూహిక లైంగికదాడి
40 రోజుల పసికందును చంపిన అత్యాచార బాధితురాలు