40 రోజుల పసికందును చంపిన అత్యాచార బాధితురాలు
Madhya Pradesh | ఓ అత్యాచార బాధితురాలు దారుణానికి పాల్పడింది. తనకు పుట్టిన బిడ్డను తన చేతులతోనే చంపేసుకుంది. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. 15 ఏండ్ల వయసున్న ఓ

భోపాల్ : ఓ అత్యాచార బాధితురాలు దారుణానికి పాల్పడింది. తనకు పుట్టిన బిడ్డను తన చేతులతోనే చంపేసుకుంది. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. 15 ఏండ్ల వయసున్న ఓ అమ్మాయికి స్థానికంగా ఉన్న అబ్బాయి(17)తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయాన్ని అనువుగా చేసుకున్న అతను.. ఆ బాలికపై ఫిబ్రవరిలో అత్యాచారం చేశాడు. ఆగస్టులో ఆమెకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకుంది. ఆమె గర్భిణి అని వైద్యులు తేల్చారు. దీంతో తనకు జరిగిన అన్యాయాన్ని బాధితురాలు తన తల్లిదండ్రులకు చెప్పింది. ఈ క్రమంలో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, జువైనల్ హోంకు తరలించారు.
అయితే బాధిత బాలిక అక్టోబర్ 16న పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆమెను నవంబర్ 5వ తేదీన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. అత్యాచారానికి గురై బిడ్డకు జన్మనివ్వడం పట్ల బాలిక తీవ్ర మనోవేదనకు గురైంది. దీంతో ఆ బాధను తట్టుకోలేక తన 40 రోజుల పసికందును గొంతు నులిమి చంపేసింది. అనారోగ్యం కారణంగా బిడ్డ చనిపోయిందని నమ్మించేందుకు ఆమె ప్రయత్నించింది. కానీ పోస్టుమార్టం నిర్వహించడంతో గొంతు నుమిలి చంపినట్లు తేలింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల ఈవెంట్.. నువ్వెందుకు వచ్చావ్?’.. ఎంవీఎస్ఆర్ కాలేజీలో ముస్లిం బౌన్సర్‌ను నిలదీసిన యువకులు!
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

