Cold Wave | హైదరాబాద్ : తెలంగాణను చలి వణికిస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎముకలు కొరికే చలి ఉండడంతో పిల్లలు, వృద్ధులు వణికిపోతున్నారు. ఇంటి నుంచి కాలు తీసి బయట పెట్టాలంటేనే భయపడిపోతున్నారు. ఉదయం 10 గంటల వరకు చలి వీడడం లేదు. మంచు కూడా విపరీతంగా కురుస్తుండటంతో రైతులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇక సంగారెడ్డి జిల్లా కోహిర్లో 6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సిర్పూర్ యూ(ఆసిఫాబాద్)లో 6.1, అర్లి(టి)(ఆదిలాబాద్)లో 6.2, గిన్నెదరి(ఆసిఫాబాద్)లో 6.2, న్యాల్కల్(సంగారెడ్డి)లో 6.3, రెడ్డిపల్లి(రంగారెడ్డి)లో 6.8, డోంగ్లీ(కామారెడ్డి)లో 6.8, చందనపల్లి(రంగారెడ్డి)లో 6.9, బేల(ఆదిలాబాద్)లో 6.9, తిర్యాని(ఆసిఫాబాద్)లో 7.1, అల్మాయిపేట(సంగారెడ్డి)లో 7.3, ఎలిమినేడు(రంగారెడ్డి)లో 7.4, రాంనగర్(ఆదిలాబాద్)లో 7.5, మల్చెల్మ(సంగారెడ్డి)లో 7.5, మేనూరు(కామారెడ్డి)లో 8.2, బోడాగల్(మెదక్)లో 8.4, రాజాపూర్(మహబూబ్‌నగర్)లో 8.4, కోట్‌పల్లి(వికారాబాద్)లో 8.5, నిర్మల్ జిల్లా కుబీర్‌లో 8.8, పెంబీలో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇక హైదరాబాద్‌లో అతి తక్కువగా బీహెచ్ఈఎల్లో 8.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజేంద్రనగర్, శేరిలింగంపల్లిలో 9.1, మౌలాలిలో 9.5, శివరాంపల్లిలో 11.2, కుత్బుల్లాపూర్‌లో 11.8, వెస్ట్‌మారేడ్‌పల్లిలో 11.8, గచ్చిబౌలిలో 12, గోల్కొండలో 12.4, పటాన్చెరులో 13.1, హయత్‌నగర్‌లో 13.3, లింగంపల్లిలో 13.7, జీడిమెట్లలో 14.8, చాంద్రాయణగుట్టలో 14.1, అంబర్‌పేటలో 14.7, కూకట్‌పల్లిలో 15.1, కంటోన్మెంట్లో 15.2, ముషీరాబాద్‌లో 15.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇవి కూడా చదవండి..
KTR | ఎంత విషం చిమ్మినా.. తెలంగాణ దాహం తీరుస్తోంది మన కాళేశ్వరం : కేటీఆర్