నల్లగొండ రూరల్, ఫిబ్రవరి 23 : హైదరాబాద్లోని గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన సీఎం కప్ క్రీడా పోటీల్లో నల్లగొండ బాలుర హాకీ జట్టు ఫైనల్స్ లో 2-0 తేడాతో నిజామాబాద్ జట్టును మట్టికరిపించి సీఎం కప్ విజేతగా నిలిచింది. నల్లగొండ జిల్లా జట్టు విజయం పట్ల జిల్లా క్రీడల అధికారి అక్బర్ అలీ, హాకీ అసోసియేషన్ కార్యదర్శి ఇమామ్ కరీం హార్షం వ్యక్తం చేశారు.