WI vs ZIM : నాకౌట్ పోరులో వెస్టిండీస్ బ్యాటర్లకు జింబాబ్వే పేసర్లు కళ్లెం వేస్తున్నారు. వాంఖడేలో దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్‌కు నగవర షాకిచ్చాడు. ఫోర్లతో రెచ్చిపోతున్న ఓపెనర్ బ్రాండన్ కింగ్(9)ను బోల్తా కొట్టించాడు. అనంతరం ముజరబని ఓవర్లో ముసెకివా క్యాచ్ వదిలేయడంతో షిఇమ్రాన్ హిట్మైర్ బతికిపోయాడు. బతికిపోయాడు. కానీ, ఎవాన్స్ బౌలింగ్‌లో ఫోర్ బాదిన షాయ్ హోప్(14) బౌడరీ వద్ద బెన్నెట్ డైవింగ్ క్యాచ్‌తో వెనుదిరిగాడు.
టాస్ గెలిచిన జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా నమ్మకాన్ని బౌలర్లు నిలబెడుతున్నారు. తొలి ఓవర్లో నగవర మూడు రన్సే ఇవ్వగా.. ముజరబని సైతం మూడే ఇచ్చాడు. ఆ తర్వాతి ఓవర్లో బ్రాండన్ కింగ్(9)ను ముసుకెవా క్యాచ్‌తో ఔట్ చేశాడు. షిమ్రన్ హిట్మైర్(20 నాటౌట్) జతగా దూకుడు పెంచాడు షాయ్ హోప్(14). నగవర వేసిన ఐదో ఓవర్లో హెట్మై ర్ హ్యాట్రిక్ ఫోర్లు బాదగా.. హోప్ ఒక ఫోర్ సాధించాడు. ఎవాన్స్ ఓవర్లోనూ ఫోర్ రాబట్టిన విండీస్ సారథి.. మరో షాట్ ఆడబోయి బౌండరీ లైన్ వద్ద బెన్నెట్ డైవింగ్ క్యాచ్ పట్టగా ఔటయ్యాడు. ఫలితంగా 54కే రెండు బిగ్ కోల్పోయింది విండీస్.