KTR | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి మల్లన్నసాగర్ నుంచి 20 టీఎంసీల నీటి తరలింపునకు జలమండలి ఆమోదం తెలిపింది. ఈ ఆమోదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత విషం చిమ్మినా.. తెలంగాణ దాహం తీరుస్తోంది మన కాళేశ్వరం అని కేటీఆర్ పేర్కొన్నారు. మల్లన్నసాగర్ వద్దని నిరాహారదీక్షలు మీరు చేసినా…నేడు మహనగర దాహార్తి తీరుస్తున్న వరప్రదాయిని మల్లన్నసాగర్ అని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసినా.. తెలంగాణను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పుడైనా చెంపలేసుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పు అని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సూచించారు. కాళేశ్వరం కూలిపోయిందని కాకమ్మ కథలు చెప్పావు. లక్ష కోట్ల నష్టం వాటిల్లిందని అబద్ధపు ప్రచారాలు చేశావు.. అధికారం కోసం కాళేశ్వరాన్ని నిందించినా.. నేడు ప్రజల దాహార్తి తీర్చే ఏకైక అస్త్రం కాళేశ్వరం అయిందని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఎంత విషం చిమ్మినా…తెలంగాణ దాహం తీరుస్తోంది మన కాళేశ్వరం!
మల్లన్నసాగర్ వద్దని నిరాహారదీక్షలు మీరు చేసినా…నేడు మహనగర దాహార్తి తీరుస్తున్న వరప్రదాయిని మల్లన్నసాగర్!
కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదని ప్రచారం చేసినా!
తెలంగాణను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం!ఇప్పుడైనా… pic.twitter.com/GHVRj3fokN
— KTR (@KTRBRS) January 4, 2025
ఇవి కూడా చదవండి..
Telangana | పంచాయతీ, ఆర్అండ్బీ రోడ్లు ప్రైవేట్ పరం.. ఇకపై ఊరు దాటితే టోల్ తీసుడే!