Congress Govt | హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని పదేపదే చెప్పుకొస్తున్న ప్రభుత్వం అప్పులో రామచంద్రా అంటూ భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) ముందు క్యూకట్టేందుకు పోటీపడుతున్నది. రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత ఆర్బీఐ నుంచి రూ.56,026 కోట్ల అప్పు తీసుకోగా మరో రూ.3,000 కోట్లు తీసుకునేందుకు సిద్ధమైంది.
రాష్ట్ర ఆర్థికశాఖ రూ.1,000 కోట్ల విలువైన 3 బాండ్లను 24 ఏండ్లు, 29 ఏండ్లు, 30 ఏండ్ల కాలానికి ఆర్బీఐకి జారీచేసింది. ఈ నెల 7న నిర్వహించే వేలంలో పాల్గొని రూ.3,000 కోట్ల రుణం పొందేందుకు సిద్ధమైంది. ఈ నెలలో 4 మంగళవారాల్లో ఆర్బీఐ నిర్వహించే వేలంలో పాల్గొని రూ.10,000 కోట్ల రుణసమీకరణ చేయనున్నది.