రుద్రంపూర్, ఫిబ్రవరి 23 : సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని వెంకటేష్ ఖని కోల్ మైన్‌లో పని చేస్తున్న ప్రవేట్ డ్రైవర్ల సీఎం పీఎఫ్‌కు సంబంధించిన 2022 -2023, 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లెక్కలు గత మూడు నెలల కిందటే మైన్ మీదికి రావడం జరిగింది. ఇప్పటివరకు డ్రైవర్లకు మాత్రం ఆ లెక్కలకు సంబంధించిన చిట్టీలు, పాస్‌బుక్స్ ఇవ్వకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వెంటనే సీఎం పీఎఫ్ లెక్కలు తెలియజేయాలని కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం ఫిట్ సెక్రెటరీ శంకర్ ఆధ్వర్యంలో సోమవారం మేనేజర్ మురళికి మెమొరాండం ఇవ్వడం జరిగింది. మేనేజర్ సానుకూలంగా స్పందించి రెండు రోజుల్లో డ్రైవర్లకు సంబంధించిన సీఎం పీఎఫ్ బుక్కులను అందజేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.