ఖమ్మం రూరల్, జూలై 16 : తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి, బీఆర్ఎస్ ఖమ్మం రూరల్ మండల మాజీ అధ్యక్షుడిగా సేవలందించిన ఆత్కూరి వెంకటేశ్వరరావు (ఏవీఆర్(77) అనారోగ్యంతో కన్నుమూశారు. వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి, ఖమ్మం రూరల్ మండల బీఆర్ఎస్ నాయకుడు బెల్లం వేణుగోపాల్, ఏవీఆర్ నివాసానికి చేరుకుని ఆయన పార్ధీవదేహంపై పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ధైర్యంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ ఉద్యమం, పార్టీ బలోపేతానికి ఏవీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా వారు కొనియాడారు. ఏదులాపురం మున్సిపాలిటీ బీఆర్ఎస్ నాయకులు బానోత్ కృష, బానోత్ మోహన్, బానోత్ వీరన్న, నాశబోయిన కనకయ్య, మేకల ఉదయ్ కుమార్, బానోత్ రెడ్యా నాయక్, కోకిల రామారావు, గొర్రె నవీన్, అఖితి వరుణ్ ఏవీఆర్కు ఘనంగా నివాళులర్పించారు. వీరితో పాటు సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, ఆ పార్టీ రాష్ట్ర నేత మహమ్మద్ మౌలానా, రామ్మూర్తి నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకుడు ఏవీఆర్ కన్నుమూత