అమరావతి : ఏపీలోని పల్నాడు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామానికి చెందిన విద్యార్థిని ప్రసన్న న్యూజెర్సీ ( New Jersey ) లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ( Road accident ) లో దుర్మరణం చెందారు. 2022లో అమెరికా ( America ) కు ఉన్నతాభ్యాసం కోసం అక్కడకు వెళ్లిన ఎంఎస్ పూర్తి చేసి ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాలు ఉంది .
ఈ క్రమంలో మంగళవారం తన ముగ్గురు స్నేహితులతో కలిసి అద్దె కారులో ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ప్రసన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు. తమ కూతురు ఇక లేదని తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.