Merit Scholarship | తొగుట, ఫిబ్రవరి 23: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెంకట్రావుపేట విద్యార్థిని కంది అర్చన ప్రతిభతో మరో మైలురాయిని అందుకుంది. కేంద్ర స్థాయిలో 2025 విద్యా సంవత్సరానికి నిర్వహించిన ఎన్.ఎం. ఎం.ఎస్ (NMMS) పరీక్షలో కంది అర్చన ఉత్తీర్ణత సాధించి మెరిట్ స్కాలర్షిప్కి అర్హత సాధించింది.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నహిమ కౌసర్ మాట్లాడుతూ.. ఇది ఉపాధ్యాయ బృందం అందించిన సమిష్టి శిక్షణ, మార్గదర్శకత ఫలితం అని పేర్కొన్నారు. అర్చన భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. ఇది మా పాఠశాల సాధించిన విజయంగా భావిస్తున్నాం. అర్చన కృషి, పట్టుదలతోనే ఈ ఫలితాన్ని సాధించిందని తెలిపారు.ఎంపికైన అర్చనకు ప్రతి సంవత్సరం రూ.12,000 చొప్పున నాలుగు సంవత్సరాలు స్కాలర్షిప్ రూపంలో లభించనున్నదని తెలిపారు.
The Paradise | ‘ది ప్యారడైజ్’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ ప్రోమో రిలీజ్.. నాని ఎనర్జీ చూసి షాక్!
Nani | మాస్ మోడ్లో నాని.. ‘బ్లడీ రోమియో’లో నేచురల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ?
MSG | ‘మన శంకర వరప్రసాద్ గారు’ సూపర్ సక్సెస్ – రీజినల్ ఇండస్ట్రీ హిట్గా సంచలనం!