Medaram | తాడ్వాయి : వచ్చే ఏడాది 2025లో జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ మినీ జాతర (మండె మెలిగే పండగ) తేదీలను శనివారం అమ్మవార్ల పూజారులు ఖరారు చేశారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల పూజారులు అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో శనివారం సమావేశం నిర్వహించారు.
ఆదివాసీ సంస్కృతీసంప్రదాయాల ప్రకారం మినీ జాతర తేదీలపై పెద్దలతో కలిసి చర్చించారు. వచ్చే ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు నాలుగు రోజలు పాటు మినీ జాతరను నిర్వహించేందుకు నిర్ణయించారు. మినీ జాతర( మండెమెలిగే పండగ)ను పురస్కరించుకొని అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురావడం మినహా మహాజాతరలో నిర్వహించినట్లుగానే పూజాకార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పూజారులు కొక్కెర కృష్ణయ్య, భోజారావు, కాక సారయ్య, కిరణ్, రమేశ్, అరుణ్‌కుమార్, అమృతమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Group-1 Mains | గ్రూప్ -1లో మెయిన్స్ పరీక్షల్లో మరోసారి కాపీయింగ్
ICICI Bank | ఐసీఐసీఐ బ్యాంకు నికర లాభంలో 18 శాతం వృద్ధి..!
IPL 2025 | ధోనీ తర్వాత సీఎస్కేను నడిపించేది అతడే.. వేలానికి వచ్చాడంటేనా..?