Group-1 Mains | హైదరాబాద్ : గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షల్లో శనివారం కాపీయింగ్ ఘటన చోటు చేసుకుంది. నారాయణమ్మ ఇంజినీరింగ్ కాలేజీలో ఓ అభ్యర్థి చిట్టీలు తీసుకొచ్చారు. ఎగ్జామ్ ప్రారంభమైన కాసేపటికే సదరు అభ్యర్థి కాపీ కొడుతుండగా, ఎగ్జామినర్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పరీక్ష నుంచి డీబార్ చేస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం సీవీఆర్ కాలేజీలో కాపీయింగ్ ఘటన మరువక ముందే.. శనివారం నారాయణమ్మ కాలేజీలో కాపీయింగ్ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది.
ఇవి కూడా చదవండి..
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
KTR | కొడంగల్‌లో కాంగ్రెస్ సర్కార్‌పై తిరుగుబాటు మొదలైంది : కేటీఆర్