ICICI Bank | ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) ద్వితీయ త్రైమాసికంలో రూ.12,948 కోట్ల కన్సాలిడేటెడ్ లాభం గడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 18.8 శాతం వృద్ధిరేటు సాధించింది. స్టాండలోన్ పద్దతిలో బ్యాంకు లాభం రూ.10,261 కోట్ల (2023-24) నుంచి రూ.11,746 కోట్లకు చేరుకున్నది. గత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే బ్యాంకు పూర్తి ఆదాయం రూ.40,697 కోట్ల నుంచి రూ.17,714 కోట్లకు పెంచుకున్నది. కీలక నికర వడ్డీ ఆదాయం 9.5 శాతం పుంజుకుని రూ.20,048 కోట్లకు చేరుకున్నది. గత ఆర్థిక సంవత్సరం (2023-24) సెప్టెంబర్ త్రైమాసికంలో వడ్డీ ఆదాయం రూ.34,920 కోట్ల నుంచి రూ.40,537 కోట్లకు పెరిగింది. స్థూల మొండి బకాయిలు 2.48 శాతంగా ఉంటే నికర మొండి బకాయిలు 0.42 శాతానికి దిగి వచ్చాయి.