మోర్తాడ్, జూలై 2: రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో భారీగా కురుస్తున్న వర్షాలతో జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. కాగా, నిజామాబాద్ జిల్లాలోని (Nizamabad) శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు(SRSP project) భారీ వరద(Massive flood) వచ్చి చేరుతున్నది. 53 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో ఎస్సారెస్పీ జల కళ సంతరించుకుంటున్నది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా, శుక్రవారం సాయంత్రానికి నీటిమట్టం 1078.5 అడుగుల (41.139 టీఎంసీల)కు నీరు చేరింది. 684 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతున్నది.