అమరావతి : దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి (Lakshmi Parvati) కి గత ప్రభుత్వం కేటాయించిన హోదాను ఉపసంహరిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్(Andhra University Registrar ) ఆచార్య ఎన్. కిషోర్‌బాబు ఒక ప్రకటనను విడుదల చేశారు.
వైఎస్ జగన్ (YS Jagan) ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత లక్ష్మీపార్వతికి తెలుగు అకాడమీ(Telugu Academy) చైర్‌పర్సన్‌గా బాధ్యతలను అప్పగించారు. ఆమె బాధ్యతలు చేపట్టిన సమయంలో గౌరవ ఆచార్యురాలు హోదాను కట్టబెట్టారు. వర్సిటీలో పరిశోధకులకు మార్గదర్శకం అందించే బాధ్యతను సైతం అప్పగించారు. ప్రస్తుత గౌరవ ఆచార్యురాలు హోదాను(Honorary Professor status) ఉపసంహరించుకుంటున్నట్లు రిజిస్ట్రార్ తెలిపారు. ఆమె వద్ద మార్గదర్శకం కోసం చేరిన పరిశోధకులను తెలుగు విభాగంలో మరొక ఆచార్యునికి మార్పు చేయాలని ఆదేశించామని వెల్లడించారు.
ఏపీ ఎన్నికల్లో అధికార వైసీపీ ప్రభుత్వం ఓటమి తరువాత వైసీపీకి చెందిన నాయకులు తమ నామినేటెడ్ పోస్టులకు రాజీనామా చేశారు. ఇందులో భాగంగా లక్ష్మీపార్వతి కూడా తెలుగు అకాడమీ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశారు.