ఆదిలాబాద్ : బైక్ను లారీ ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి(Man dies) చెందాడు. ఈ విషాదకర సంఘటన ఆదిలాబాద్(Adilabad )జిల్లా తలమడుగు మండలం కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని వర్ణికి చెందిన యువకుడు బైక్ పై తలమడుగు మండలం సుంకిడి నుంచి సంత గ్రామానికి వెళుతుండగా ఎదురుగా వస్తున్న లారీ అతడిని ఢీ కొట్టింది. దీంతో సదరు వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అదుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో స్థానికులు ఆందోళన చేపట్టారు. ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు రోడ్డు ప్రమాదం జరగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..