Virat Kohli | ఇటీవల పేలవ ఫామ్‌తో సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli).. ఇప్పుడు తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగానే దేశవాళీలలో పుష్కరకాల సుదీర్ఘ విరామానికి తెరదించుతూ రంజీ బరిలోకి దిగబోతున్నాడు. రైల్వేస్ (Railways)తో ఈనెల 30న ప్రారంభం కానున్న మ్యాచ్‌లో ఈ పరుగుల వీరుడు ఢిల్లీ తరఫున ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగానే తాజాగా ఢిల్లీ రంజీ జట్టు (Delhi Ranji team)లోకి కోహ్లీ చేరిపోయాడు.
Virat Kohli has begun his preparations for Delhi’s upcoming Ranji Trophy match at the Arun Jaitley Stadium pic.twitter.com/kg7CRNe00I
— Virat Kohli Fan Club (@Trend_VKohli) January 28, 2025
ముంబై నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్న విరాట్ కోహ్లీ.. ఢిల్లీ రంజీ జట్టులోకి చేరిపోయాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో (Arun Jaitley Stadium) ప్రాక్టీస్ కూడా మొదలు (training session) పెట్టాడు. గ్రూప్ రన్నింగ్, ఫీల్డింగ్ డ్రిల్స్‌లో పాల్గొన్నాడు. ఆటగాళ్లతోకలిసి ఫుట్‌బాల్ ఆట కూడా ఆడాడు. కాగా, కోహ్లీ 2012లో చివరిసారిగా దేశవాళీల్లో ఆడిన విషయం తెలిసిందే. దేశవాళీకి రీఎంట్రీలో భాగంగా కొంతకాలంగా తనను వేధిస్తున్న బ్యాక్‌ఫుట్, ఆఫ్ సైడ్ ఆఫ్ స్టంప్ బలహీనతల నుంచి బయటపడేందుకు గాను విరాట్.. ఆర్సీబీ మాజీ కోచ్ సంజయ్ బంగర్ సమక్షంలో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. సోమవారం కూడా కోహ్లీ.. ముంబైకి సమీపంలో ఉన్న అలీభాగ్ వద్ద బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు.
Virat Kohli is playing a circle football game with the Delhi Ranji team pic.twitter.com/94Q5n0lNKg
— Virat Kohli Fan Club (@Trend_VKohli) January 28, 2025
Virat Kohli at Arun Jaitley Stadium 😍 pic.twitter.com/Ock3jyVlLH
— Virat Kohli Fan Club (@Trend_VKohli) January 28, 2025
Virat Kohli working on his back foot game! 🔥 pic.twitter.com/5A7vjOsc59
— Virat Kohli Fan Club (@Trend_VKohli) January 28, 2025
Also Read..
Karnataka | మాకొద్దు ఈ ప్రైజ్‌మనీ.. తిరస్కరించిన కర్నాటక ఖోఖో ప్రపంచకప్ ప్లేయర్లు
National Games | నేటి నుంచి నేషనల్ గేమ్స్.. 205 మందితో తెలంగాణ బరిలోకి