Karnataka | బెంగళూరు: అరంగేట్రం ఖో ఖో ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యులైన తమ రాష్ట్ర ప్లేయర్లకు ఇచ్చిన ప్రైజ్‌మనీపై కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నది. ఇటీవలే ముగిసిన ఖో ఖో వరల్డ్‌కప్ టైటిల్ సాధించిన భారత జట్లలో సభ్యులైన ఎమ్కే గౌతమ్, చైత్రకు సీఎం సిద్ధరామయ్య 5 లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకం ప్రకటించారు. దీనిపై అటు ప్లేయర్లతో పాటు ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి.
ఇదే ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యులైన తమ ప్లేయర్లకు మహారాష్ట్ర ప్రభుత్వం 2.25కోట్ల ప్రైజ్‌మనీతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించింది. అలాంటిది కర్నాటక ప్రభుత్వం తమకు ఏదో ముష్టి వేసినట్లు 5లక్షలు ఇచ్చి అవమాన పరిచిందని ప్లేయర్లు వాపోయారు. మహారాష్ట్ర ప్రభుత్వం అంత ఇవ్వకపోయినా కనీసం గుర్తింపు అయినా ఇవ్వాలని ప్లేయర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. మీరిచ్చిన ప్రైజ్‌మనీ తమకు వద్దని వారు సున్నితంగా తిరస్కరించారు. దీనిపై అటు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డాయి. ఇచ్చినప్పుడు తీసుకోవడం బెటర్ లేకపోతే ఇవి కూడా మళ్లీ దొరకవంటూ సెటెర్లు వేస్తున్నారు.