Mohammed Shami | భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా మంగళవారం రాజ్‌కోట్ వేదికగా మూడో మ్యాచ్ జరుగనున్నది. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి ఫాస్ బౌలర్ మహ్మద్ షమీ పునరాగమంపైనే ఉన్నది. గత రెండు మ్యాచుల్లో తుది జట్టులో చోటు దక్కని విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లోనూ షమీకి తుది జట్టులో ఆడేది అనుమానంగానే ఉన్నది. మ్యాచ్‌కు ముందు బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కొటక్ షమీ రీ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశాడు.
సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగనున్న మ్యాచ్‌కు ముందు షమీ ఫిట్‌నెస్‌పై సీతాన్షు కొటక్ అప్డేట్ ఇచ్చాడు. షమీ ఫిట్నెస్ సాధించాడని తెలిపాడు. మ్యాచ్ ఆడతాడా? లేదా ? అన్నదానిపై మాత్రం సమాధానం చెప్పేందుకు నిరాకరించాడు. తుదిజట్టులో సీనియర్ బౌలర్‌ను తీసుకునే విషయం కెప్టెన్, కోచ్ నిర్ణయం తీసుకోవాలని సీతాన్షు పేర్కొన్నారు. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌కు సైతం షమీని సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీలోని ఆడనున్నాడు. వరుస మ్యాచులతో పని భారం పెరిగే అవకాశం ఉన్న పరిస్థితుల్లో.. కోచ్, కెప్టెన్ అతన్ని ఎలా వాడుకోవాలనే నిర్ణయం తీసుకుంటారని బ్యాటింగ్ కోచ్ పేర్కొన్నారు. రాబోయే మ్యాచులు, వన్డేల్లో షమీకి ప్రత్యేకంగా ప్రణాళిక ఉందని.. తుది జట్టులో కనిపించకపోవడానికి ఫిట్నెస్ సమస్య కచ్చితంగా కాదని తెలిపాడు.
2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత షమీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఓటమిపలైన విషయం తెలిసిందే. చీలమండ గాయంతో షమీ జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. జాతీయ జట్టులోకి వచ్చేందుకు సిద్ధమైన సమయంలోనే.. ఎడమ మోకాలు వాచిపోయింది. ఆ తర్వాత కోలుకొని దేశవాళీ క్రికెట్లో రాణించాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం షమీని భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.
భారత జట్టు (అంచనా) : సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రమణ్‌దీప్ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లాండ్ జట్టు : ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), బెన్ డకెట్, జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జేమీ స్మిత్, జేమీ ఓవర్టన్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
Virat Kohli | దేశవాళీకి సిద్ధం.. నేడు ఢిల్లీ జట్టుతో చేరనున్న విరాట్ కోహ్లీ!
Karnataka | మాకొద్దు ఈ ప్రైజ్‌మనీ.. తిరస్కరించిన కర్నాటక ఖోఖో ప్రపంచకప్ ప్లేయర్లు