Virat Kohli | ముంబై : దేశవాళీలలో పుష్కరకాల సుదీర్ఘ విరామానికి పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ త్వరలోనే తెరదించనున్నాడు. ఇటీవల పేలవ ఫామ్‌తో సర్వత్రా విమర్శలను ఎదుర్కుంటున్న కోహ్లీ.. మరో రెండ్రోజుల్లో రంజీ మ్యాచ్ ఆడేందుకు అంతా సిద్ధమవుతున్నాడు. 2012లో చివరిసారిగా దేశవాళీల్లో ఆడిన కోహ్లీ.. ఈనెల 30 నుంచి రైల్వేస్‌తో జరుగబోయే మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున ఆడేందుకు సుముఖత వ్యక్తం చేశాడు.
మంగళవారం అతడు ఢిల్లీ జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేసే అవకాశముందని కోచ్ శరణ్‌దీప్ సింగ్ స్పష్టం చేశాడు. దేశవాళీకి రీఎంట్రీలో భాగంగా కొంతకాలంగా తనను వేధిస్తున్న బ్యాక్‌ఫుట్, ఆఫ్ సైడ్ ఆఫ్ స్టంప్ బలహీనతల నుంచి బయటపడేందుకు గాను విరాట్.. ఆర్సీబీ మాజీ కోచ్ సంజయ్ బంగర్ సలహాలతో ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. సోమవారం కూడా కోహ్లీ.. ముంబైకి సమీపంలో ఉన్న అలీభాగ్ వద్ద బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు.