National Games | డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ వేదికగా మంగళవారం 38వ జాతీయ క్రీడలకు అధికారికంగా తెరలేవనుంది. స్థానిక రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నేషనల్ గేమ్స్ మొదలుకానున్నాయి. 18 రోజుల పాటు జరుగునన్న టోర్నీలో మొత్తం 32 క్రీడాంశాల్లో దాదాపు 10వేల మంది ప్లేయర్లు పోటీపడనున్నారు. రాష్ట్రంలోని ఏడు నగరాల్లో జరుగనున్న నేషనల్ గేమ్స్ పోటీలు జరుగనున్నాయి. 22 క్రీడాంశాల్లో 205 మందితో తెలంగాణ బరిలోకి దిగుతున్నది.