ఒకే ప్లాట్‌ఫాంపై రెండు రైళ్లు
కాజీపేట రైల్వే జంక్షన్లో ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంపై రెండు రైళ్లు ఒకేలా ఉండడం, అధికారులు చేసిన అనౌన్స్‌మెంట్‌తో ప్రయాణికులు ఆగమాగమైన ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంపై బలార్షాకు వెళ్లే రామగిరి, సికింద్రాబాద్‌కు వెళ్లే పుష్పుల్ రైళ్లు నిలిపారు. ఈ క్రమంలో అధికారులు ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంపై రామగిరి ఉందని, మరికొంత సేపటికే సికింద్రాబాద్ పుష్పుల్ రైలు కూడా ఉందని అనౌన్స్ చేశారు.
- కాజీపేట రైల్వే అధికారుల నిర్వాకం
- ప్రయాణికులు ఆగమాగం
కాజీపేట, మార్చి 2 : కాజీపేట రైల్వే జంక్షన్లో ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంపై రెండు రైళ్లు ఒకేలా ఉండడం, అధికారులు చేసిన అనౌన్స్‌మెంట్‌తో ప్రయాణికులు ఆగమాగమైన ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంపై బలార్షాకు వెళ్లే రామగిరి, సికింద్రాబాద్‌కు వెళ్లే పుష్పుల్ రైళ్లు నిలిపారు. ఈ క్రమంలో అధికారులు ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంపై రామగిరి ఉందని, మరికొంత సేపటికే సికింద్రాబాద్ పుష్పుల్ రైలు కూడా ఉందని అనౌన్స్ చేశారు. రెండు రైళ్లు ఒకేలా ఉండడం.. ఆదివారం సెలవు దినం ముగిసి సోమవారం వర్కింగ్ డే కావడంతో తప్పని పరిస్థితిల్లో వెళ్లాల్సిన ప్రయాణికుల్లో కొందరు బలార్షా వైపునకు వెళ్లే వాళ్లు సికింద్రాబాద్ పుష్పుల్, సికింద్రాబాద్ పుష్పుల్లో వెళ్లాల్సిన వారు బలార్షాకు వెళ్లే రామగిరి రైలులో కూర్చున్నారు.
రైల్వే జంక్షన్ నుంచి మొదటగా రామగిరి రైలు కదిలి బలార్షా వైపునకు వెళ్తుండగా, సికింద్రాబాద్‌కు వెళ్లాల్సిన ప్రయాణికులు గమనించి లబోదిబోమంటూ చైన్‌ను లాగి కిందికి దిగి సికింద్రాబాద్‌కు వైపునకు వెళ్లే పుష్పుల్ రైలుక్కారు. బలార్షా వైపునకు వెళ్లే రామగిరి ప్రయాణికులు కూడా గమనించి సికింద్రాబాద్ పుష్పుల్ చైన్ లాగి కిందికి దిగి వారు వెళ్లే రైలు ఎక్కారు. సుమారు అరగంటకు పైగా ప్రయాణికులు ఆగమయ్యారు. అదేవిధంగా కాజీపేట రైల్వే జంక్షన్లో ప్లాట్‌ఫాంలు ఖాళీ లేకపోవడంతో సికింద్రాబాద్ నుంచి విజయవాడ వైపునకు వెళ్లే నాగవళి, కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అధికారులు ఓటర్లోనే దాదాపు గంటపాటు నిలిపివేశారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

