హైదరాబాద్ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో(Road accident) తీవ్ర గాయాలైన వారిని తన ఎస్కార్ట్ వాహనంలో హాస్పిటల్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. గురువారం కేటీఆర్ సిరిసిల్ల నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా మార్గమధ్యలో జిల్లెల్ల వద్ద ఓ ఆక్సిడెంట్లో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన ఆయన అంబులెన్స్ వచ్చే వరకు సమయం పడుతుందని భావించి, క్షతగాత్రులను తన ఎస్కార్ట్ వాహనంలో సిరిసిల్ల ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. కాగా, సకాలంలో స్పందించి మానవతా దృక్పథంతో ఆదుకున్న కేటీఆర్‌ను పలువురు ప్రశంసించారు.
ఆక్సిడెంట్లో తీవ్ర గాయాలైన వారిని తన ఎస్కార్ట్ వాహనంలో హాస్పిటల్‌కు పంపిన కేటీఆర్
కేటీఆర్ సిరిసిల్ల నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా మార్గమధ్యలో జిల్లెల్ల వద్ద ఓ యాక్సిడెంట్లో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
గమనించిన కేటీఆర్ అంబులెన్స్ వచ్చే వరకు సమయం పడుతుందని, తన ఎస్కార్ట్… pic.twitter.com/GaXPP5DUtU
— Telugu Scribe (@TeluguScribe) October 25, 2024