Jani Master | లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నేడు చంచల్‌గూడ జైలు నుంచి విడుదల అయ్యారు. జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరు కావడంతో శుక్రవారం విడుదల చేశారు. లేడి డ్యాన్సర్‌ను లైంగికంగా వేధించాడంటూ ఆరోపణల నేపథ్యంలో సెప్టెంబర్ 20న అరెస్ట్ అయ్యాడు జానీ మాస్టర్. గత 36 రోజులుగా జైలు జీవితం గడిపిన జానీకి రంగారెడ్డి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో నేడు విడుదల అయ్యారు.
2017లో టీవీ షోలో పాల్గోన్న ఒక మహిళ కొరియోగ్రాఫర్‌తో జానీ మాస్టర్‌కు పరిచయం ఏర్పడింది. ఆ సమయంలోనే జానీ తన టీంలో తీసుకున్నాడని.. నేను మైనర్‌గా ఉన్న సమయంలోనే ఒక హోటల్లో జానీ తనపై హత్యాచారానికి పాల్పడ్డాడు అని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఫిర్యాదును స్వీకరించిన నార్సింగి పోలీసులు జానీ మాస్టర్‌పై ఐపీసీ 376, 506, 323 సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. యువతి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రోడ్యూస్ చేసి రిమాండ్‌కు తరలించారు. రీసెంట్గా జాతీయ అవార్డుల నేపథ్యంలో అక్టోబర్ 06 నుంచి 09 వరకు బెయిల్ కావాలని కోర్టును కోరగా.. బెయిల్ మంజూరు చేసింది. అయితే అవార్డును క్యాన్సిల్ చేసింది జాతీయ అవార్డుల కమిటీ. అనంతరం బెయిల్ గడువు ముగియడంతో మళ్లీ జైలుకు వెళ్లాడు జానీ. అయితే రెగ్యూలర్ బెయిల్ కోసం పోక్సో కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. దీనిని విచారించిన రంగారెడ్డి జిల్లా కోర్టు అతడికి బెయిల్‌ను మంజూరు చేసింది.
చంచల్ గూడ జైలు నుండి బెయిల్‌పై విడుదలైన జానీ మాస్టర్
36 రోజులు చంచల్ గూడ జైలులో ఉండి, హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదల. https://t.co/2KlOcgVCqy pic.twitter.com/2U9AtZyuMU
— Telugu Scribe (@TeluguScribe) October 25, 2024