Abdelaziz Barrada : ప్రపంచ ఫుట్‌బాల్‌లో విషాదం నెలకొంది. మొరాకో మాజీ సాకర్ ఆటగాడు అబ్డెలాజిజ్ బరాద్ (Abdelaziz Barrada) చిన్నవయసులోనే కన్నుమూశాడు. మిడ్‌ఫీల్డర్‌గా రాణించిన బరాద్ 35 ఏండ్లకే ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లాడు. తమ ఆరాధ్య ఆటగాడు ఇక లేడనే వార్త తెలిసి మొరాకో అభిమానులు షాక్‌లో ఉండిపోయారు. బరాద్ మృత్యుఒడికి చేరడంతో ఫుట్‌బాల్ దిగ్గజాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
‘బరాద్ మరణం మొరాకోకు పూడ్చలేని లోటు అని ఆ దేశ ఫుట్‌బాల్ సమాఖ్య సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. రాయల్ మొరాకో ఫుట్‌బాల్ సమాఖ్య బరాద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోంది’ అని తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. అయితే.. బరాద్ అకాల మరణానికి కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉంది.
Abdelaziz Barrada 🇲🇦 est décédé à l’âge de 35 ans d’une crise cardiaque. 🕊️
Ancien international marocain et passé par l’OM ⚪🔵 Barrada a pris sa retraite en 2021 Paix à son âme 🤲🙏 pic.twitter.com/1hFsA1FOtx— AFRICAFOOTUNITED_OFFICIEL (@africafootutd) October 24, 2024
ఫ్రాన్స్‌లో పుట్టిన బరాద్ ఫుట్‌బాల్ మీద ఇష్టంతో అదే ఆటను కెరీర్‌గా ఎంచుకున్నాడు. మొదట్లో పారిస్ సెయింట్ జర్మనీ(PSG) క్లబ్‌కు ఆడిన బరాద్ అక్కడే తన ఆటకు మెరుగులు దిద్దుకున్నాడు. అనంతరం మొరాకో, మర్సీఎల్లే జట్లకు ఆడిన బరాద్ మిడ్ ఫీల్డర్‌గా పలు విజయాల్లో భాగమయ్యాడు.
అయితే.. అతడి కెరీర్ సాగింది కొన్నాళ్లే. 26 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన బరాద్ చివరిసారిగా 2015లో మైదానంలోకి దిగాడు. ఆ తర్వాత ఆరేండ్లకు అంటే.. 2012లో సాకర్‌కు వీడ్కోలు పలికాడు. మొరాకో జాతీయ జట్టు తరఫునే కాకుండా.. అల్ నస్రీ(సౌదీ అరేబియా), అంటల్యాస్పొర్(టర్కీ) వంటి క్లబ్స్‌కు కూడా బరాద్ ప్రాతినిధ్యం వహించాడు.