Kannappa | మంచు ఫ్యామిలీ నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa). దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నిర్మిస్తుండగా.. మంచు విష్ణు (Manchu Vishnu) కథానాయకుడిగా నటిస్తున్నాడు. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ అగ్ర తారలు నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్రబృందం.
ప్రమోషన్స్ కోసం ఒక వినుత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని నిర్ణయించుకుంది. ఇక ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి అయిన కేదార్నాథ్ ఆలయంను నేడు మంచు మోహన్‌బాబు, విష్ణుతోపాటు కలిసి కన్నప్ప టీం దర్శించుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను విష్ణు ఇన్‌స్టా వేదికగా పంచుకున్నాడు. ”12 జ్యోతిర్లింగాల యాత్రను ప్రారంభించాను. ఇందులో భాగంగా పవిత్ర కేదార్నాథ్ క్షేత్రాన్ని దర్శించుకున్నాం. అలాగే కన్నప్ప సినిమా కోసం అది చేయబోయే ప్రయాణం కోసం ప్రార్థించాం.” అంటూ విష్ణు రాసుకోచ్చాడు.