Reliance Jio | ప్రముఖ టెలికం కంపెనీ రిలయన్స్ జియో.. దీపావళి సందర్భంగా తన కస్టమర్లకు ‘దీపావళి దమాకా’ ఆఫర్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా జియో యూజర్లు జియో ట్రూ 5జీ త్రైమాసికం నుంచి వార్షిక ప్రీ పెయిడ్ ప్లాన్లపై ట్రావెల్స్ పోర్టళ్లు, ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్స్, ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ల ద్వారా రూ.3,350 వరకూ ఫ్రీ ఓచర్లు అందుకోవచ్చు. కొత్త జియో, ప్రస్తుత జియో కస్టమర్లు ఏదేనీ రిలయన్స్ డిజిటల్ లేదా మై జియో స్టోర్లో రూ.20 వేల పైచిలుకు ఖర్చు చేస్తే వార్షిక సబ్ స్క్రిప్షన్ ఫ్రీ ఆఫర్ చేస్తోంది.
జియో దీపావళి దమాకా ఆఫర్లలో భాగంగా రూ.899లకే త్రైమాసికం ప్రీ పెయిడ్ ప్లాన్ ఆఫర్ చేసింది. దీంతో ట్రూ అన్ లిమిటెడ్ 5జీ బెనిఫిట్లు పొందొచ్చు. అన్ లిమిటెడ్ కాలింగ్, రోజూ 2జీబీ డేటా, 90 రోజుల్లో అదనంగా 20 జీబీ డేటా లభిస్తుంది. రూ.3599లతో కూడిన వార్షిక ప్లాన్ 365 రోజులు పని చేస్తుంది. దీనిపై రోజూ 2.5 జీబీ డేటా అందిస్తుంది.
దీపావళి దమాకా ఆఫర్ లో భాగంగా రూ.3,350 విలువైన బెనిఫిట్లు ఆఫర్ చేస్తోంది రిలయన్స్ జియో. ఇందులో హోటళ్లలో బస చేసినా, విమాన ప్రయాణం చేసినా వినియోగించుకునేందుకు రూ.3000 విలువైన ఈజ్ మై ట్రిప్ వోచర్ అందిస్తుంది. రూ.999, అంత కంటే ఎక్కువ ప్లాన్ కొనుగోలు జేస్తే అజియో నుంచి రూ.200 విలువైన కూపన్, సెలెక్టెడ్ రీచార్జీ ప్లాన్లతో రూ.150 విలువైన స్విగ్గీ ఓచర్ పొందొచ్చు. ఈ ఓచర్లు, కూపన్లు ప్రీపెయిడ్ ప్లాన్లు రీచార్జి చేసుకున్న తర్వాత వారి ఖాతాలో క్రెడిట్ అవుతాయి. వాటిని రీడిమ్ చేసుకోవాల్సి ఉంటుంది.
అందుకోసం మైజియో యాప్ ఓపెన్ చేసి ఆఫర్ సెక్షన్ లోకి నేవిగేట్ కావాలి. అటుపై మై విన్నింగ్స్ ఆప్షన్ ఓపెన్ చేయాలి. తర్వాత మీకు వచ్చే కూపన్ టాప్ చేసి రీడిమ్ చేసుకోవాలి. తదుపరి కూపన్ కోడ్ కాపీ చేసి పార్టనర్ వెబ్ సైట్ ను సందర్శించి పేమెంట్ టైంలో కూపన్ అప్లయ్ చేయాలి. ఈ ఆఫర్లు నవంబర్ ఐదో తేదీ వరకూ అందుబాటులో ఉంటాయి.