జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్యూరులో ఆదివాసీలు ఏర్పాటు చేసిన కుమ్రం భీం(Kumram Bhim statue) విగ్రహావిష్కరణ ఉద్రిక్తతలకు దారి తీసింది. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి(MLA Kova Lakshmi) మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, జయశంకర్ భూపాలపల్లి మాజీ జెడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిని తోపాటు ఆదివాసీ నేతలు హాజరయ్యారు. అయితే పోలీసులు విగ్రహ ఆవిష్కరణకు అనుమతి లేదంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా ఉద్రిక్తతల మధ్య కోవా లక్ష్మి విగ్రహాన్ని ఆవిష్కరించారు.