Telangana | బీరు సీసాలో బల్లి.. వికారాబాద్ జిల్లాలో షాకింగ్ ఘటన
Telangana | వికారాబాద్ జిల్లాలో పార్టీ చేసుకుందామని పెద్ద ఎత్తున బీర్లు కొనుగోలు చేసిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. బడ్వైజర్ బీరు తాగుదామని ఓపెన్ చేయబోయిన వ్యక్తికి అందులో బల్లి అవశేషాలు కనిపించాయి. దీంతో షాకైన వ్యక్తి.. బాటిల్‌ను ఓపెన్ చేయకుండానే తీసుకెళ్లి తనకు మందు అమ్మిన వైన్ షాపు యజమాని ముందుంచాడు.
Telangana | వికారాబాద్ జిల్లాలో పార్టీ చేసుకుందామని పెద్ద ఎత్తున బీర్లు కొనుగోలు చేసిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. బడ్వైజర్ బీరు తాగుదామని ఓపెన్ చేయబోయిన వ్యక్తికి అందులో బల్లి అవశేషాలు కనిపించాయి. దీంతో షాకైన వ్యక్తి.. బాటిల్‌ను ఓపెన్ చేయకుండానే తీసుకెళ్లి తనకు మందు అమ్మిన వైన్ షాపు యజమాని ముందుంచాడు. కానీ తనకేమీ సంబంధం లేదని దబాయించడంతో సదరు వ్యక్తి వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం కేరెల్లి గ్రామానికి చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి, అనంతయ్య ఇద్దరూ పార్టీ చేసుకోవడానికి రూ.4వేల విలువైన మద్యాన్ని కొనుగోలు చేశారు. మండల కేంద్రంలోని ఓ వైన్ షాపు నుంచి బీర్లతో పాటు వివిధ బ్రాండ్లకు చెందిన మందును తీసుకున్నారు. తీరా పార్టీ చేసుకుందామని బీరు బాటిల్ ఓపెన్ చేయబోతే అందులో ఏదో తేడాగా కనిపించింది. అదేంటని క్షుణ్నంగా పరిశీలించగా అతని దిమ్మతిరిగిపోయింది. బడ్వైజర్ బీరు బాటిల్లో చనిపోయిన బల్లి అవశేషాలు కనిపించాయి. దీంతో ఒక్కసారిగా షాకైన వాళ్లు.. వెంటనే తమకు మందు అమ్మిన వైన్ షాపునకు వెళ్లారు.
బీరు బాటిల్లో బల్లి ఉందని చూపిస్తే సదరు వైన్ షాపు యజమాని తమకేమీ సంబంధం లేదని దబాయించాడు. కంపెనీ నుంచే అలా వచ్చి ఉంటుంది.. మేమేం చేస్తామంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. దీంతో లక్ష్మీకాంత్ రెడ్డి బీర్ బాటిల్ వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు. ఈ పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనిపై మందుబాబులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
వికారాబాద్ జిల్లా ధారూరులో బడ్వైజర్ బీరు బాటిల్లో బల్లి అవశేషాలు. pic.twitter.com/xvplogzaTt
— Telugu Scribe (@TeluguScribe) October 25, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Manik Rao | చెరుకు రైతుకు రూ.4,500 మద్దతు ధర ఇవ్వాలి: ఎమ్మెల్యే మాణిక్ రావు
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కంటికి చికిత్స.. ఆస్పత్రికి తరలింపు
Crime News | ఆ బంధానికి అడ్డుగా ఉన్నాడని 24 ఏళ్ల కొడుకును ప్రియుడితో కలిసి చంపిన తల్లి..!
Om | ‘ఓమ్’ చిత్రంలో సాయిపల్లవి పవర్ఫుల్ పోలీస్ రోల్.. ఆ రియల్ ఆఫీసర్ స్పూర్తే కారణం!
రేవంత్ రెడ్డికి మెడికవర్ హాస్పిటల్స్‌పై ఉన్న శ్రద్ధ ప్రభుత్వ దవాఖానలపై ఎందుకు లేదు? : మన్నె క్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

