IND vs NZ 2nd Test : సిరీస్ సమం చేయాలంటే గెలవక తప్పని మ్యాచ్. స్పిన్ పిచ్ మీద బౌలర్లు న్యూజిలాండ్ (Newzealand)ను స్వల్ప స్కోర్‌కే ఆలౌట్ చేశారు. ఇక భారీ స్కోర్ అందించి జట్టును గట్టెక్కించాల్సిన బ్యాటర్లు చేతులెత్తేశారు. టర్నింగ్ పిచ్ మీద మేము ఆడలేమంటూ.. చెత్త షాట్లతో వికెట్ పారేసుకున్నారు. ఫలితంగా.. పట్టుబిగించాల్సిన చోట టీమిండియా 156 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ సాంట్నర్(7/53) అత్యుత్తమ గణాంకాలు నమోదు చేస్తూ రోహిత్ సేనను దెబ్బకొట్టగా.. కెప్టెన్ టామ్ లాథమ్(86), వికెట్ కీపర్ టామ్ బ్లండెల్(30 నాటౌట్)లు తాపీగా ఆడుతూ స్కోర్ బోర్డును ఉరికించారు.
బెంగళూరు టెస్టులో జయభేరి మోగించిన న్యూజిలాండ్ పుణే టెస్టులోనూ పట్టు బిగిస్తోంది. రెండో టెస్టులో తొలి రోజు మనదైతే.. రెండో రోజు న్యూజిలాండ్‌ది. ఈ రెండు రోజులు మొత్తంగా స్పిన్నర్లదే హవా నడించింది. స్పిన్ అస్త్రంతో కివీస్‌ను దెబ్బ కొట్టాలనుకున్న భారత్ చివరకు అదే ఉచ్చులో విలవిలలాడింది. బంతి టర్న్ అవుతుందని తెలిసినా భారత స్టార్ ఆటగాళ్లు అనవసర షాట్లు ప్రయత్నించి వికెట్ పారేసుకున్నారు. దాంతో, భారీ ఆధిక్యం సాధించి కివీస్‌ను ఒత్తిడిలోకి నెట్టాలనుకున్న రోహిత్ శర్మ వ్యూహం ఫలించలేదు. బదులుగా టీమిండియాపైనే పర్యాటక జట్టు ఒత్తిడిని పెంచేసింది.
Maiden Test five-fors. Both seven-wicket hauls.
Washington Sundar 🤝 Mitchell Santner
Before Pune, the last time two bowlers took seven-fors in the first two innings of a Test match was in 1997 😮 https://t.co/30c6MAmhxh #INDvNZ pic.twitter.com/YT3TDtFff1
— ESPNcricinfo (@ESPNcricinfo) October 25, 2024
సాంట్నర్ (7/53) తిప్పేయగా ఏ ఒక్కరూ క్రీజులో నిలబడలేకపోయారు. రెండో రోజు తొలి సెషన్లోనే శుభ్‌మన్ గిల్(30) వికెట్ తీసిన సాంట్నర్.. ఆ కాసేపటికే విరాట్ కోహ్లీ(1)ను బౌల్డ్ చేశాడు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే కుదురుకున్న యశస్వీ జైస్వాల్(30)ను గ్లెన్ ఫిలిఫ్స్ బోల్తా కొట్టించాడు. అంతే.. అక్కడితో భారత ఇన్నింగ్స్ పేకమేడను తలపించింది. రిషభ్ పంత్(18), సర్ఫరాజ్ ఖాన్(11)లు ధాటిగా ఆడబోయి ఔటయ్యారు. అయితే.. టీమిండియా 150 కొట్టిందంటే అదంతా రవీంద్ర జడేజా(38), వాషింగ్టన్ సుందర్(18)ల చలవే.
తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లతో న్యూజిలాండ్ నడ్డివిరిచిన సుందర్(4/56) రెండో ఇన్నింగ్స్‌లోనూ వికెట్ల వేట కొనసాగించాడు. తొలుత ఓపెనర్ డెవాన్ కాన్వే(17)ను ఎల్బీగా ఔట్ చేసి బ్రేకిచ్చాడు. మరోవైపు అశ్విన్ తన మ్యాజిక్ చూపిస్తూ విల్ యంగ్(23)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కివీస్‌ను మరింత ఒత్తిడికి గురి చేస్తూ రచిన్ రవీంద్ర(9)లను , డారిల్ మిచెల్(18)లను సుందర్ డగౌట్ చేర్చాడు. అయితే.. ఓపెనర్ టామ్ లాథమ్(86) మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. మిచెల్ ఔటయ్యాక టామ్ బ్లండెల్(30 నాటౌట్) తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. భారత బౌలర్లను విసిగిస్తూ ఐదో వికెట్‌కు 60 పరుగులు జోడించాడు.
A maiden five-for and a maiden ten-for in Pune for Washington Sundar 👏 https://t.co/3D1D83IgS1 #INDvNZ pic.twitter.com/1zPvt3xCRL
— ESPNcricinfo (@ESPNcricinfo) October 25, 2024
కొరకరాని కొయ్యలా మారిన ఈ జోడీని సుందర్ విడదీశాడు. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న డేంజరస్ లాథమ్‌ను ఎల్బీగా వెనక్కి పంపాడు. ఆ క్షణం.. హమ్మయ్యా.. అని ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం గ్లెన్ ఫిలిఫ్స్(9 నాటౌట్).. ఆడారు. రెండో రోజు ఆట ముగిసే సరికి న్యూజిలాండ్ 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసి.. ఆధిక్యాన్ని 301కి పెంచుకుంది. ఈ టెస్టులో ఓటమి తప్పాలంటే బెంగళూరు టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగినట్టు భారత బ్యాటర్లు తమ తడాఖా చూపించాలి.