War 2 Movie | దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ (NTR) వరుస ప్రాజెక్ట్‌లను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే లైన్లో దేవర పార్ట్ 2 ఉండగా.. దీనితో పాటు ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఉంది. అయితే తారక్ వార్ 2 సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ చిత్రంలో తారక్ నెగటివ్ రోల్లో కనిపిస్తారని సమాచారం. అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
తాజాగా ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుండగా.. రీసెంట్ గా ఎన్టీఆర్ కూడా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ ముంబైలోనే ఉన్నాడు. అయితే తారక్ వార్ 2 షూటింగ్లో ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీషర్ట్, డెనిమ్ జాకెట్, కార్గో ప్యాంటుతో ఉన్న తారక్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#War2 🔥#JrNTR #HrithikRoshan pic.twitter.com/ulAdK9rQv7
— Telugu Chitraalu (@TeluguChitraalu) October 25, 2024