David Warner : అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner)కు పెద్ద ఊరట. సుదీర్ఘ కెరీర్లో మాయని మచ్చలా నిలిచిన సాండ్ పేపర్ వివాదం (Sand Paper Scandal) నుంచి ఎట్టకేలకు డేవిడ్ భాయ్ బయటపడ్డాడు. ఆరేండ్లుగా అతడిని కెప్టెన్‌గా కాకుండా విధించిన జీవితకాల నిషేధాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ఎత్తేసింది. దాంతో, ఇకపై వార్నర్ బిగ్‌బాష్ లీగ్‌లో సారథిగా ఎంపికయ్యే అవకాశముంది. ఇంతకూ వార్నర్ ఈ వివాదంలో ఎలా చిక్కుకున్నాడో తెలుసా?
ఆస్ట్రేలియా జట్టు 2018 మార్చిలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. కేప్‌టౌన్‌లో టెస్టు మ్యాచ్ సమయంలో ఆసీస్ ఆటగాడు కామెరూన్ బ్యాన్‌క్రాఫ్ట్ (Cameron Bancraft) సాండ్‌పేపర్‌తో బంతిని రుద్దుతూ కెమెరా కంట పడ్డాడు. అతడిపై విచారణ జరపగా.. బాల్ ట్యాంపరింగ్‌లో వార్నర్, స్టీవ్ స్మిత్‌ల హస్తం కూడా ఉందని తేలింది. దాంతో, ఆసీస్ ఆటగాళ్లపై మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
🚨 DAVID WARNER’S LIFE TIME BAN FOR LEADERSHIP HAS BEEN LIFTED 🚨
– Warner can lead in BBL 2024-25…!!!! pic.twitter.com/gtubcQJcIA
— Johns. (@CricCrazyJohns) October 25, 2024
ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆస్ట్రేలియా బోర్డు.. వార్నర్, స్మిత్‌లు జాతీయ జట్టుకు కెప్టెన్సీ చేయకుండా జీవితకాల నిషేధం విధించింది. అయితే.. అందులో తన తప్పు లేదని వార్నర్ మొత్తుకున్నా ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు ఆసీస్ బోర్డు వార్నర్‌పై సస్పెన్షన్‌ను ఎత్తేయడంతో 6 ఏండ్ల న్యాయపోరాటం ఫలించింది. ఓ దశలో తన కెరీర్‌ను ప్రశ్నార్థకం చేసిన సాండ్ పేపర్ వివాదం గురించి వార్నర్ వీడ్కోలు అనంతరం కీలక వ్యాఖ్యలు చేశాడు.
JUST IN!
David Warner has made a successful review of his lifetime leadership ban #BBL14— cricket.com.au (@cricketcomau) October 24, 2024
‘నేను నా ఆత్మకథ రాస్తున్నా. పుస్తకం ద్వారా ఎన్నో సంచలన విషయాలను మీతో పంచుకోబోతున్నా. ఆ బుక్ ఎందరినో షాక్‌కు గురి చేస్తుంది. అంతేకాదు నా కెరీర్‌ను కుదిపేసిన సాండ్‌పేపర్ వివాదం (Sandpaper Scandal) గురించి కూడా ప్రస్తావించబోతున్నా’ అని వార్నర్ వెల్లడించాడు. దాంతో, డేవిడ్ భాయ్ ఏం సంచలన విషయాలు చెబుతాడు? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాండ్ పేపర్ వివాదం నుంచి బిగ్ రిలీఫ్ లభించడంతో వార్నర్.. బీబీఎల్‌లో సిడ్నీ థండర్స్ జట్టుకు కెప్టెన్ అయ్యే అవకాశముంది.
ప్రపంచంలోని విధ్వంసక ఓపెనర్లలో ఒకడిగా పేరొందిన వార్నర్ ఆటకు విజయంతో వీడ్కోలు పలికాడు. అదే సమయంలో వన్డేలకు కూడా రిటైర్మెంట్ పలుకుతున్నానని ప్రకటించాడు. ఇకపై టీ20 లీగ్స్‌లో మాత్రమే కనిపిస్తానని చెప్పిన వార్నర్ .. శరీరం సహకరిస్తే చాంపియన్స్ ట్రోఫీ 2025కు అందుబాటులో ఉంటానని తెలిపాడు. కెరీర్ ఆసాంతం దూకుడే మంత్రగా ఆడిన ఈ లెఫ్ట్ హ్యాండర్ ఆస్ట్రేలియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. నాలుగు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఆసీస్ జట్టులో సభ్యుడైన వార్నర్ ఓపెనర్‌గా పలు రికార్డులు నెలకొల్పాడు.
Mawa @davidwarner31 nuvvu maaku support cheste India lo neeku aadhar card ipposta😁 https://t.co/PJDOIW4wuq
— VijayAgaRwal (@Agarwal_2228) October 22, 2024
అన్ని ఫార్మట్ల నుంచి వైదొలిగిన ఈ మాజీ ఓపెనర్.. మళ్లీ పునరగామనంపై కన్నేసినట్టు తెలుస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓపెనర్ సమస్య ఎదుర్కొంటున్న ఆసీస్‌కు అతడు భారీ ఆఫర్ ఇచ్చాడు. భారత్‌తో సిరీస్ కోసం అమసరమైతే నాకు ఒక్క ఫోన్ చేయండి. అందుబాటులో ఉంటాను అని సెలెక్టర్లకు ఓపెన్‌గా చెప్పేశాడు. అయితే.. అతడు సరదాగా అంటున్నాడా? నిజంగానే సిరీయస్‌గా ఉన్నాడా? అని ఆసీస్ సెలెక్టర్లు తలలు పట్టుకుంటున్నారు.