India – China | భారత్-చైనా (India – China) మధ్య తూర్పు లఢక్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద గత కొన్నేండ్ల నుంచి కొనసాగుతున్న ప్రతిష్ఠంభనపై ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చిన విషయం తెలిసిందే. ఎల్ఏసీ వెంబడి గస్తీని పునరుద్ధరించాలని రెండు దేశాలు అంగీకారం కుదుర్చుకున్నాయి. అందుకు అనుగుణంగానే సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ మొదలైంది. తూర్పు లఢక్ (Ladakh) సెక్టార్‌లోని రెండు కీలక ప్రాంతాలైన డెమ్చోక్ (Demchok ), డెప్సాన్ (Depsan)నుంచి రెండు దేశాల బలగాలు వెనక్కి వెళ్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను ఈ నెల చివరికంతా పునరుద్ధరించనున్నట్లు తెలిసింది. ఈ మేరకు సంబంధిత అధికారులను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
వాస్తవానికి గాల్వాన్ లోయలో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆ తర్వాత ఇరుదేశాల 50-60వేల మంది సైనికులను ఎల్ఏసీలో మోహరించాయి. చైనాను ఎదుర్కొనేందుకు డోక్లామ్ తరహాలో భారత్ వ్యూహాలను సిద్ధం చేసింది. చైనా సైన్యాన్ని ఉపసంహరించుకోవాల్సిందేనని భారత్ స్పష్టం చేసింది. 2020 నాటి పరిస్థితిని పునరుద్ధరించాల్సిందేనని చెప్పింది. దాదాపు నాలుగున్నరేళ్ల తర్వాత చైనా మెట్టుదిగి వచ్చింది. జూన్ 15, 2020న గాల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణలో కల్నల్‌తో సహా 20 మంది సైనికులు అమరులయ్యారు. చైనాకు చెందిన 40 మంది సైతం ప్రాణాలు కోల్పోయారు. అయితే, సైనికుల మరణాలను చైనా ధ్రువీకరించలేదు. 1962 యుద్ధం తర్వాత ఇరుదేశాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది.
Also Read..
Indians killed | టెస్లా కారులో చెలరేగిన మంటలు.. నలుగురు భారతీయులు మృతి
Germany Visas | భారతీయ ఉద్యోగులకు జర్మనీ గుడ్ న్యూస్.. భారీగా పెంచిన వీసాల జారీ సంఖ్య
Air Pollution | తీవ్ర వాయు కాలుష్యం.. కేంద్రం కీలక సూచనలు