Indians killed | కెనడా (Canada)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టొరంటో సమీపంలో అర్ధరాత్రి సమయంలో ఓ టెస్లా కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు భారతీయులు ప్రాణాలు (Indians killed) కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు గుజరాత్ (Gujarat)లోని గోద్రాకు చెందిన వారిగా గుర్తించారు.
గోద్రా (Godhra)కు చెందిన 30 ఏళ్ల కేతా గోహిల్, 26 ఏళ్ల నిల్ గోహిల్.. మరో ఇద్దరు వ్యక్తులతో టెస్లా కారులో ప్రయాణిస్తున్నారు. అయితే, వీరు ప్రయాణిస్తున్న టెస్లా కారు టొరంటో సమీపంలో డివైడర్ను ఢీ కొట్టింది (Tesla crashes into divider). అనంతరం కారులో మంటలు చెలరేగాయి (catches fire). ప్రమాదం అనంతరం కారు బ్యాటరీకి మంటలు అంటుకున్నట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారంతా ప్రాణాలు కోల్పోయారు. అటుగా వెళ్తున్న వాహనదారులు కారులోని వారిని రక్షించేందుకు ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. మంటల దాటికి వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఫలితంగా నాలుగు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సి వచ్చింది. మృతుల్లో ఇద్దరు ఇటీవలే కెనడా పౌరసత్వం పొందినట్లుగా తెలిసింది.
Also Read..
Germany Visas | భారతీయ ఉద్యోగులకు జర్మనీ గుడ్ న్యూస్.. భారీగా పెంచిన వీసాల జారీ సంఖ్య
Air Pollution | తీవ్ర వాయు కాలుష్యం.. కేంద్రం కీలక సూచనలు