Germany Visas | భారతీయులకు జర్మనీ గుడ్ న్యూస్ చెప్పింది. నైపుణ్యం కలిగిన భారతీయ కార్మికుల (Skilled Indians) వీసాలను (Germany Visas) 20,000 నుంచి 90,000కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) శుక్రవారం వెల్లడించారు. న్యూఢిల్లీలో జరిగిన 18వ ఆసియా-పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ జర్మన్ బిజినెస్ 2024లో ప్రధాని మాట్లాడుతూ.. ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ సదస్సులో జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. రాబోయే 25 ఏళ్లలో వికసిత్ భారత్‌కు రోడ్ మ్యాప్ రూపొందించినట్లు చెప్పారు. ఈ ముఖ్యమైన సమయంలో జర్మన్ క్యాబినెట్ ‘ఫోకస్ ఆన్ ఇండియా’ పేరిట డాక్యుమెంట్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. నైపుణ్యం కలిగిన భారతీయ ఉద్యోగుల వీసాల సంఖ్యను 20 వేల నుంచి 90 వేలకు పెంచాలని జర్మనీ నిర్ణయించినట్లు ఈ సందర్భంగా మోదీ ప్రకటించారు. ఈ నిర్ణయం జర్మనీ వృద్ధికి దోహదపడుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు.
Also Read..
Air Pollution | తీవ్ర వాయు కాలుష్యం.. కేంద్రం కీలక సూచనలు
Elephant | ఏనుగుతో సెల్ఫీ కోసం యత్నం.. తొక్కి చంపిన గజరాజు
Amitabh Bachchan | ముంబైలో ఒకేసారి 10 ఫ్లాట్స్‌ను కొనుగోలు చేసిన బిగ్‌బీ.. ఎన్ని కోట్లంటే..?