Elephant | మహారాష్ట్రలో (Maharashtra) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఏనుగుతో సెల్ఫీ కోసం యత్నించి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గడ్చిరోలిలోని అబాపూర్ అడవుల్లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. శ్రీకాంత్ రామచంద్ర సాత్రే (23) తన ఇద్దరు స్నేహితులతో కలిసి నవేగావ్ నుంచి గడ్చిరోలి జిల్లాలో కేబుల్ లేయింగ్ పని కోసం వచ్చాడు. ఈ క్రమంలో చిట్టగాండ్ – గడ్చిరోలి అటవీ ప్రాంతం నుంచి అడవి ఏనుగు (Wild Elephant) ఒకటి బయటకు వచ్చినట్లు తెలుసుకున్నారు. అబాపూర్ అటవీ ప్రాంతంలో ఆ ఏనుగు సంచరిస్తున్నట్లు తెలిసి.. పని మధ్యలో ఏనుగును చూసేందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. గురువారం ఉదయం తన ఇద్దరు స్నేహితులతో కలిసి శ్రీకాంత్ అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు.
అక్కడ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ సరదాగా గడిపారు. ఇంతలోనే వారికి అడవి ఏనుగు తారసడింది. దూరం నుంచి ఏనుగుతో సెల్ఫీ దిగాలని శ్రీకాంత్ అనుకున్నాడు. ఈ క్రమంలో ఆగ్రహించిన గజరాజు వారిని వెంబడించింది. ఈ క్రమంలో ఏనుగు బారి నుంచి మిగతా ఇద్దరు తప్పించుకోగా.. శ్రీకాంత్ మాత్రం దొరికిపోయాడు. ఈ క్రమంలో అతడిపై ఏనుగు దారుణంగా దాడి చేసింది. తొండంతో కొడుతూ.. కిందపడేసి కాలితో తొక్కేసింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మిగతా ఇద్దరు ప్రాణాలతో దాని బారి నుంచి తప్పించుకోగలిగారు.
Also Read..
Modi Laddu | ప్రధానిపై అభిమానం.. దీపావళికి ‘మోదీ లడ్డూ’.. ప్రత్యేకంగా తయారు చేస్తున్న వ్యాపారి
DY Chandrachud | మార్నింగ్ వాక్కు వెళ్లడం మానేశా.. ఢిల్లీలో వాయు కాలుష్యంపై సీజేఐ ఆందోళన