Modi Laddu | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు భారత్‌తోపాటు విదేశాల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. అంతేకాదు ప్రజాదరణ పొందిన గొప్ప నేతల్లో మోదీ ముందు వరుసలో ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై ఉన్న అభిమానంతో బీహార్‌కు చెందిన ఓ వ్యాపారి (Bihar Sweet Seller) ప్రత్యేకమైన లడ్డూలను తయారు చేస్తున్నారు.
రానున్న దీపావళి (Diwali) కోసం ‘మోదీ లడ్డూ’ (Modi Laddu) పేరుతో గంగాజలంతో వీటిని ప్రత్యేకంగా తయారు చేస్తుండటం విశేషం. స్వచ్ఛమైన కుంకుమపువ్వు, దేశీ నెయ్యి, పిస్తా, బాదం పప్పుతోపాటు రోజ్ వాటర్, జ్యూస్‌తో వీటిని ప్రత్యేకంగా తయారు చేస్తున్నట్లు సదరు మిఠాయి దుకాణం వ్యాపారి లాలూ శర్మ తెలిపారు. వీటిని త్వరలోనే దేశప్రజలకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. తాను వారణాసికి చెందిన వాడినని.. మోదీ కూడా వారణాసి (Varanasi) నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు గుర్తుచేశారు. తమప్రాంతానికి ఉన్న అనుబంధం నేపథ్యంలో ఈ లడ్డూలో గంగాజలం వాడుతున్నట్లు వివరించారు. ఈ లడ్డూ స్వచ్ఛమైన సువాసన దేశమంతటా వ్యాపిస్తుందన్నారు.
Bhagalpur, Bihar: A sweet vendor and admirer of PM Modi, Sanjeev alias Lalu Sharma, has created special laddus named “Modi Laddu” for Diwali.
He says, “The year Modi ji became Prime Minister, we made a royal laddu in his honor using pure saffron, desi ghee, pistachios, and… pic.twitter.com/F0eTjyBL7v
— IANS (@ians_india) October 24, 2024
Also Read..
Vistara flight | హైదరాబాద్‌కు వస్తున్న విమానం జైపూర్‌కు దారి మళ్లింపు
DY Chandrachud | మార్నింగ్ వాక్కు వెళ్లడం మానేశా.. ఢిల్లీలో వాయు కాలుష్యంపై సీజేఐ ఆందోళన