Vistara flight | ఢిల్లీ నుంచి హైదరాబాద్ (Delhi To Hyderabad)కు వస్తున్న విస్తారా ఫ్లైట్(Vistara flight) జైపూర్ (Jaipur)కు దారి మళ్లించారు. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్లో ఒకరికి అత్యవసరంగా వైద్య చికిత్స (medical emergency) అవసరం ఉండటంతో విమానాన్ని దారి మళ్లించాల్సి వచ్చింది.
విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన UK-829 విమానం శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరింది. అయితే విమానంలో ఓ ప్రయాణికుడికి అత్యవసరంగా చికిత్స అవసరం ఏర్పడింది. దీంతో అధికారులు ఆ విమానాన్ని వెంటనే జైపూర్‌కు దారి మళ్లించారు. ఉదయం 8:30 గంటల సమయంలో జైపూర్‌లో విమానం ల్యాండ్ అయినట్లు సదరు ఎయిర్‌లైన్స్ తెలిపింది. అనారోగ్యంతో ఉన్న ప్రయాణికుడిని వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొంది. త్వరలోనే విమానం హైదరాబాద్‌కు బయల్దేరనున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read..
DY Chandrachud | మార్నింగ్ వాక్కు వెళ్లడం మానేశా.. ఢిల్లీలో వాయు కాలుష్యంపై సీజేఐ ఆందోళన
Air Pollution | క్షీణించిన గాలి నాణ్యత.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానికులు
Drugs | హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ సీజ్.. విదేశీయుడు సహా నలుగురు అరెస్ట్