Air Pollution | దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) ఎక్కువైంది. దీపావళి పండుగకు ముందే వాయు నాణ్యత క్షీణించింది. పొరుగు రాష్ట్రాల్లో వ్యర్థాలను తగులబెడుతుండడంత ఢిల్లీలో కాలుష్యం పెరిగింది. దీనికి తోడు పొగమంచు కూడా రాజధాని ప్రాంతాన్ని ఆవహించింది. దీంతో నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (Air Quality Index) తక్కువగా ఉన్నట్లు కాలుష్య నియంత్రణ మండలి (Central Pollution Control Board) పేర్కొంది.
#WATCH | Delhi: Morning walkers, joggers and cyclists work out at Kartavya Path near India Gate amid deteriorating air quality in the city. pic.twitter.com/zKEELVNrS4
— ANI (@ANI) October 25, 2024
శుక్రవారం ఉదయం 8 గంటలకి గాలి నాణ్యత 283 వద్ద నమోదైనట్లు తెలిపింది. ఆనంద్ విహార్లో 218, పంజాబీ బాగ్లో 245, ఇండియా గేట్ పరిసర ప్రాంతాల్లో 276, జిల్మిల్ ఇండస్ట్రియల్ ఏరియాలో 288గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది. గత రెండు రోజులుగా రాజధానిలో కాలుష్యం పెరిగిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. కాలుష్యం కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు వాపోతున్నారు.
ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రిసెర్చ్ నివేదిక ప్రకారం.. గాలి నాణ్యత 447కు పడిపోవడం అంటే దాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణించవచ్చు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి, కాలుష్యం లేదని, AQI 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని అర్థం. ఇక AQI 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, AQI 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, AQI 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని అర్థం చేసుకోవచ్చు. కాగా, ఈ మధ్య ఢిల్లీలో వాయు కాలుష్యం ఆందోళనకరంగా మారుతున్న విషయం తెలిసిందే.
Also Read..
Zeeshan Siddique: ఎన్సీపీలో చేరిన బాబా సిద్ధిక్ కుమారుడు జీషాన్ సిద్ధిక్
Anmol Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ను పట్టిస్తే రూ.10 లక్షలు
Software Engineer | పని ఒత్తిడి.. కోకాపేటలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ బలవన్మరణం