Software Engineer | పని ఒత్తిడి.. కోకాపేటలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ బలవన్మరణం
కోకాపేటలో విషాదం చోటుచేసుకున్నది. ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ (Software Engineer) ఏడు అంతస్తుల బిల్డింగ్ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
హైదరాబాద్: నగరంలోని కోకాపేటలో విషాదం చోటుచేసుకున్నది. ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ (Software Engineer) ఏడు అంతస్తుల బిల్డింగ్ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాగ ప్రభాకర్.. కోకాపేటలో హాస్టల్లో ఉంటూ గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో గత రాత్రి హాస్టల్ గదికి వచ్చిన ఆయన భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. ప్రభాకర్ మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పని ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తున్నది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

