హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి పెద్దమొత్తంలో డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. హుమాయున్గర్లో స్థానిక పోలీసులతో కలిసి హెచ్ న్యూ అధికారులు దాడులు నిర్వమించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. వారివద్ద 50 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. ఓ విదేశీయుడితోపాటు హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు డ్రగ్ పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. దాని విలు రూ.25 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు.
మరోవైపు బాచుపల్లి పీఎస్ పరిధిలోని టకీలా పబ్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. అనుమతులు లేకుండా పబ్‌లో కార్పొరేట్ ఈవెంట్లు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. దీంతో పబ్‌లో మ్యూజిక్ పరికరాలు, రెండు ల్యాప్‌టాప్‌లను సీజ్ చేశారు. పబ్ యజమానులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.