భోపాల్: వేర్వేరు చోట్ల ఇద్దరు మహిళలపై అత్యాచారం జరిగింది. (women raped) కొత్తగా పెళ్లైన యువతిపై కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అలాగే మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న మహిళపై లైంగిక దాడి జరిగింది. మధ్యప్రదేశ్‌లోని రెండు నగరాల్లో ఈ రెండు దారుణాలు జరిగాయి. కొత్తగా పెళ్లైన 19 ఏళ్ల యువతి, 20 ఏళ్ల యువకుడైన భర్తతో కలిసి సోమవారం రాత్రి రేవాలోని పిక్నిప్ స్పాట్‌కు వెళ్లింది. అక్కడున్న ఫౌంటెన్ వద్ద భర్తతో ఆమె గొడవపడింది. ఇంతలో ఐదుగురు వ్యక్తులు ఆ యువతి వద్దకు వచ్చారు. భర్తను చెట్టుకు కట్టి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుమారు వంద మంది అనుమానితులను ప్రశ్నించారు.
కాగా, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న 40 ఏళ్ల మహిళపై ఇండోర్‌లో అత్యాచారం జరిగింది. సోమవారం అర్ధరాత్రి వేళ ఒంటరిగా రోడ్డుపై నడిచి వెళ్తున్న ఆమెను 20 ఏళ్ల యువకుడు గమనించాడు. ఆ మహిళను తన వెంట తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడి పారిపోయాడు. బాధిత మహిళను గస్తీ పోలీసులు గమనించి హాస్పిటల్‌కు తరలించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఒకే రోజు రెండు ప్రాంతాల్లో ఇద్దరు మహిళలపై అత్యాచారం జరుగడంతో మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి.