నాగర్కర్నూల్ : సతీమణిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని(Lakshmareddy) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచలో జరిగిన లక్ష్మారెడ్డి సతీమణి శ్వేత దశదినకర్మకు హాజరయ్యారు. శ్వేత చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
వారి వెంట మాజీ మంత్రులు మహమూద్ అలీ, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్థన్ రెడ్డి, రాంమోహన్ రెడ్డి రాజేందర్ రెడ్డి, ఆల వెంకటేశ్వర రెడ్డి, గువ్వల బాలరాజు, ఎంఎల్సీ నవీన్ కుమార్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, నాయకులు ఆంజనేయులు గౌడ్, బండారి భాస్కర్, గెల్లు శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | ఇంకెంత మంది ప్రాణాలు కోల్పోవాలి..? రోడ్డుప్రమాదాలపై కేటీఆర్ ట్వీట్
TG EAPCET 2024 | బీ ఫార్మసీ, ఫార్మ్ డీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల