KTR | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. నాచారం వద్ద ఎల్పీజీ ట్రక్కు ఢీకొనడంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఆ మహిళ మృతి చెందడం ఆమె కుటుంబానికి ఊహించని పీడకల అని అన్నారు. తన బిడ్డను స్కూల్లో వదిలిపెట్టి ఇంటికి తిరిగి రాకుండానే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిందన్నారు. పదో తరగతి చదువుతున్న ఓ యువతి కూడా ఈ ప్రాంతంలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నదని కేటీఆర్ గుర్తు చేశారు.
చర్యలు తీసుకునే ముందు ఇంకెంత మంది ప్రాణాలు కోల్పోవాలి..? అని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పిల్లలు పాఠశాలకు వచ్చే వేళ, ఇంటికి తిరిగి వెళ్లే సమయాల్లో భారీ వాహనాలను స్కూల్ జోన్ల పరిధిలోకి అనుమతించకూడదని కేటీఆర్ సూచించారు. అధికారులు ముందే మేల్కొని రోడ్డు భద్రతా చర్యలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉండదని కేటీఆర్ అన్నారు. అధికారులు తమ ప్రాథమిక విధులను సక్రమంగా నిర్వర్తిస్తే ఎలాంటి ప్రాణ నష్టం జరగదని కేటీఆర్ పేర్కొన్నారు.
Deeply saddened by the tragic loss of life in the LPG truck accident at Nacharam. A routine day turned into an unimaginable nightmare for a mother and the family. She never came back home after dropping her child at school!
Just recently, a young 10 class girl also suffered a… pic.twitter.com/BOMzC2EdRt
— KTR (@KTRBRS) September 19, 2024
ఇవి కూడా చదవండి..
KTR | మహాలక్ష్ముల నెత్తిన బండ.. నమ్మించి వంచన చేయడమే కాంగ్రెస్ నైజం: కేటీఆర్
KTR | సివిల్స్ మెయిన్స్ అభ్యర్థులకు కేటీఆర్ ఆల్ ది బెస్ట్