హైదరాబాద్: కాంగ్రెస్ రాయితీ గ్యాస్ సిలిండర్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గ్యాస్ రాయితీ ఉత్త గ్యాస్ అంటూ మండిపడ్డారు. మహాలక్ష్ముల నెత్తిన బండ పెట్టారంటూ ఫైర్ అయ్యారు. సగం మందికిపైగా మొండి చెయ్యి చూపారని విమర్శించారు. ఆపడి ఓట్టేసిన ఆడబిడ్డలను మోసం చేశారన్నారు. నమ్మించి వంచన చేయడమే కాంగ్రెస్ నైజం అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. నీరుగారిపోతున్న గ్యారెంటీలు.. గంగలో కలిసిన హామీలంటూ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు.
మహాలక్ష్ముల నెత్తిన బండ..!
గ్యాస్ రాయితీ ..ఉత్త గ్యాస్..!
సగం మందికిపైగా మొండి చెయ్యే..!
ఆశపడి ఓట్లేసిన ఆడబిడ్డలకు మోసం..!
నమ్మించి వంచన చేయడమే కాంగ్రెస్ నైజం..!
నీరుగారిపోతున్న గ్యారెంటీలు గంగలో కలిసిన హామీలు..! pic.twitter.com/7HfobyqnzQ
— KTR (@KTRBRS) September 19, 2024
మానవత్వం చూపాల్సిన చోట కూడా ఈ కోతలెందుకు అంటూ ఖమ్మం వరద సాయంపై ప్రభుత్వాన్ని కేటీఆర్ నిలదీశారు. వరద సాయంలోనూ కొర్రీలెందుకని ప్రశ్నించారు. ముందు జాగ్రత్తలు లేకుండా ఖమ్మం జనాన్ని ముంచింది చాలదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకోకుండా బాధ పెట్టడం ఎందుకన్నారు. మెలికలు, షరతులు లేకుండా నష్టపోయిన ప్రతి కుటుంబానికి పరిహారం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.
మానవత్వం చూపాల్సిన చోట కూడా ఈ కోతలెందుకు..?
వరద సాయంలోనూ కొర్రీలెందుకు..?
ముందు జాగ్రత్తలు లేకుండా ఖమ్మం జనాన్ని ముంచింది చాలదా..?
బాధితులను ఆదుకోకుండా బాధ పెట్టడం ఎందుకు..?
మెలికలు..షరతులు లేకుండా నష్టపోయిన ప్రతి కుటుంబానికి పరిహారం ఇవ్వాల్సిందే..! pic.twitter.com/K7JULl84WT
— KTR (@KTRBRS) September 19, 2024