Harish Rao | హైదరాబాద్ : ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాష గురించి లేఖలో హరీశ్‌రావు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఖర్గేను కోరారు.
రేవంత్ రెడ్డి భాషపై కాంగ్రెస్ అధిష్టానం అభ్యంతరం చెప్పకపోవడంపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ టెర్రరిస్ట్ అంటూ బీజేపీ చేసిన వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్.. కేసీఆర్‌పై రేవంత్ భాషను కట్టడి చేయకపోవడంపై హరీశ్ రావు ఆగ్రహం వెలిబుచ్చారు. రేవంత్ భాషను ప్రోత్సహిస్తున్న హైకమాండ్‌కు బీజేపీ వ్యాఖ్యలను ఖండించే నైతిక హక్కు కూడా లేదన్నారు. పోలీసులు సీఎం రేవంత్‌కు కీలుబొమ్మలుగా మారి నియంతృత్వ పాలనకు నిదర్శనంగా నిలుస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. సీఎం అనుచరులు నేరాలకు పాల్పడినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. హమీలపై నిలదీస్తే ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడులు చేయిస్తున్నారు. రేవంత్ రెడ్డి తీరుపట్ల కాంగ్రెస్ అధిష్టానం మౌనం దురదృష్టకరం. తెలంగాణలోని పరిస్థితి మహాభారతాన్ని గుర్తు చేస్తోంది. ధృతరాష్ట్రుడు తన కొడుకు దుర్యోధనుడి క్రూరమైన అతిక్రమణలను ఉద్దేశపూర్వకంగా విస్మరించినట్టు కాంగ్రెస్ అధిష్టానం తీరు ఉందని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
Open Letter to Shri @kharge ji , President, AICC
Subject: The Hypocrisy of Indian National Congress in Encouraging shri @revanth_anumula Abusive & Criminal Language Against Shri @KCRBRSPresident Garu, President, @BRSparty – An Appeal for Stern Disciplinary Action.@RahulGandhi… pic.twitter.com/wRNvBiXzw6
— Harish Rao Thanneeru (@BRSHarish) September 19, 2024
ఇవి కూడా చదవండి..
Gurukula Employees | తొలి జీతమే చేదు జ్ఞాపకం.. గురుకులాల్లో కొత్త ఉద్యోగులకు ఇంకా అందని జీతం!
KTR | మహాలక్ష్ముల నెత్తిన బండ.. నమ్మించి వంచన చేయడమే కాంగ్రెస్ నైజం: కేటీఆర్
KTR | రైతుల సంఘటిత శక్తి ముందు దగాకోరు కాంగ్రెస్ ప్రభుత్వం తలవంచక తప్పదు: కేటీఆర్